ఐపీఎల్ వేలంపై తీవ్రస్థాయిలో స్పందించిన రాబిన్ ఊతప్ప
- సంతలో పశువుల్లా కొంటున్నారని వ్యాఖ్యలు
- వస్తువుల కోసం పోటీపడినట్టు ఉందని వెల్లడి
- ఆటగాళ్ల వేలం ఒక్క భారత్ లోనే జరుగుతోందన్న ఊతప్ప
- వేలానికి బదులు డ్రాఫ్ట్ పద్ధతి మేలని సూచన
ఒకప్పుడు తన ప్రతిభతో టీమిండియాలో స్థానం సంపాదించిన కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప ప్రస్తుతం దేశవాళీలకే పరిమితమయ్యాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆటగాళ్ల వేలంపై తీవ్రస్థాయిలో స్పందించాడు.
ఐపీఎల్ వేలం ప్రక్రియను చూస్తే సంతలో పశువులను కొనుగోలు చేస్తున్న భావన కలిగిందని వ్యాఖ్యానించాడు. వస్తువుల కోసం పోటీపడుతున్నట్టుగా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయని పేర్కొన్నాడు. వేలంలో ఓ ఆటగాడ్ని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే సరి... ఎవరూ కొనకపోతే అతడి పరిస్థితి ఎంత బాధాకరమో ఎవరూ ఊహించలేరని ఊతప్ప ఆవేదన వ్యక్తం చేశాడు.
వేలం తీరుతెన్నులు చూస్తే క్రికెటర్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు విస్మరించినట్టుగా అనిపించిందని తెలిపాడు. భారత్ లో తప్ప ఇలా ఆటగాళ్ల వేలం ప్రపంచంలో ఎక్కడా జరగడంలేదని, వేలానికి బదులు డ్రాఫ్ట్ పద్ధతి అమలు చేస్తే బాగుంటుందని ఊతప్ప సూచించాడు.