బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై కేసు నమోదు

  • కాంగ్రెస్ తరపున బరిలోకి సోనూ సోదరి మాళవిక
  • పోలింగ్ రోజున ఆమె కోసం ప్రచారం
  • నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు
బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లో కేసు నమోదైంది. ఆదివారం పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోనూసూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై మోగాలో కేసు నమోదైంది.

సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్‌లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. పోలింగ్ రోజున తన సోదరి కోసం సోనూ ప్రచారం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలీసులు తెలిపారు.


More Telugu News