ప్రభాస్ బరిలో దిగుతుండగా రిస్క్ చేస్తున్న సూర్య!
- కోలీవుడ్ లో సూర్యకి మంచి క్రేజ్
- తెలుగులోను మంచి మార్కెట్
- తాజా చిత్రంగా రూపొందిన 'ఈటి'
- మార్చి 10వ తేదీన విడుదల
తమిళంతో పాటు తెలుగులోను సూర్యకి మంచి క్రేజ్ ఉంది .. మంచి మార్కెట్ ఉంది. తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన తాజా చిత్రమైన 'ఎతరుక్కుమ్ తునింధవన్' విషయంలోనూ ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.
తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేస్తున్నారు. అయితే ఆ మరుసటి రోజునే 'రాధే శ్యామ్' రంగంలోకి దిగుతోంది. మార్చి 11వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
అలాంటి ఒక పాన్ ఇండియా సినిమాకి ఒక రోజు ముందు థియేటర్లకు రావడమనేది రిస్క్ తో కూడుకున్న పనే. ఇంతకుముందు సూర్య చేసిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారానే ప్రేక్షకులను పలకరించాయి. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో ఆయన థియేటర్లకు వస్తున్నాడు.
అలాంటి ఈ సినిమా విషయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సాహసమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక మోహన్ కథానాయికగా అలరించనుండగా, ముఖ్యమైన పాత్రల్లో సత్యరాజ్ .. శరణ్య కనిపించనున్నారు. .
తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేస్తున్నారు. అయితే ఆ మరుసటి రోజునే 'రాధే శ్యామ్' రంగంలోకి దిగుతోంది. మార్చి 11వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
అలాంటి ఒక పాన్ ఇండియా సినిమాకి ఒక రోజు ముందు థియేటర్లకు రావడమనేది రిస్క్ తో కూడుకున్న పనే. ఇంతకుముందు సూర్య చేసిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారానే ప్రేక్షకులను పలకరించాయి. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో ఆయన థియేటర్లకు వస్తున్నాడు.
అలాంటి ఈ సినిమా విషయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సాహసమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక మోహన్ కథానాయికగా అలరించనుండగా, ముఖ్యమైన పాత్రల్లో సత్యరాజ్ .. శరణ్య కనిపించనున్నారు.