'భీమ్లా నాయక్' ఫారెస్ట్ ఫైర్ .. ఆపడం కష్టం: తమన్
- 'భీమ్లా నాయక్' ఒక తుపాన్
- ఆడియన్స్ నుంచి అదే మాట వచ్చింది
- త్రివిక్రమ్ సపోర్ట్ మరిచిపోలేనిది
- ఆయనకి థ్యాంక్స్ అని చెప్పిన తమన్
పవన్ కల్యాణ్ తాజా చిత్రమైన 'భీమ్లా నాయక్' భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ .. " ఈ సినిమా తుపాన్ లా దూసుకుపోతుందని నాకు ముందుగానే తెలుసు. కాకపోతే ఆ మాట ఆడియన్స్ వైపు నుంచి రావాలి.
ఈ సినిమా సక్సెస్ లో నేనొక పిల్లర్ అని అంటున్నారు. ఆ పిల్లర్లో సిమెంట్ మాత్రం త్రివిక్రమ్ గారే. ఆయన ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు .. సపోర్టు చేశారు. నన్ను ఎప్పటికప్పుడు ముందుకు తోస్తూనే ఉన్నారు. అందుకు ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో పనిచేయడం ఒక మరిచిపోలేని అనుభవం.
ఈ సినిమా ఒక ఫారెస్ట్ ఫైర్ లాంటిది .. ఇక దీనిని ఆపడం కష్టం. ఈ సినిమా గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ప్రస్తుతం అంత సమయం లేదు. మరో వేదికపై మాట్లాడతాను. ఈ సినిమా కథకి తగిన పాటలను అందించిన రామజోగయ్య శాస్త్రి గారికీ .. కాసర్ల శ్యామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.