ప్రెస్ నోట్: అత్యుత్తమ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌

 
ప్రెస్ నోట్:  అత్యుత్తమ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ను వీక్షించడం కోసం డిస్నీ హాట్‌స్టార్‌ పై ఒక మిలియన్‌కు పైగా లాగిన్స్‌తో  రికార్డు సృష్టించిన అభిమానులు.
 
డిస్నీ హాట్‌స్టార్‌ పై నూతన రికార్డును సృష్టిస్తూ బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అత్యధిక వీక్షకుల సంఖ్యతో పాటుగా వీక్షణ సమయంను నమోదు చేసింది. ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై మొట్టమొదటిసారిగా ఇంతటి భారీ విజయం నమోదు చేసిన తొలి తెలుగు రియాల్టీ షో ఇది. డిస్నీ హాట్‌స్టార్‌ వీక్షకులు బిగ్‌బాస్‌ షో పట్ల  విపరీతమైన అభిమానం చూపడంతో పాటుగా తొలి రోజు నుంచే అత్యధిక వీక్షణ సమయాలనూ నమోదుచేశారు.
 
డిస్నీ హాట్‌స్టార్‌ కంటెంట్‌ హెడ్‌ మరియు డిస్నీ స్టార్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ హెచ్‌ఎస్‌ఎం గౌరవ్‌ బెనర్జీ మాట్లాడుతూ ‘‘ బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రియాల్టీ షో కు వచ్చిన స్పందన పట్ల మేము పూర్తి సంతోషంగా ఉన్నాము. ఈ షోను  డిస్నీ హాట్‌స్టార్‌పై స్ట్రీమింగ్‌ చేయడం ఆరంభించిన మరుక్షణమే వీక్షించడానికి రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు సిద్ధమయ్యారు. ఈ షో పట్ల  వీక్షకుల ఆసక్తి మరియు ప్రతిస్పందన కు ఇది అద్దం పడుతుంది’ అని అన్నారు.
 
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘  ఎల్లప్పుడూ అండగా ఉండే మా ప్రేక్షకులకు నేను ధన్యవాదములు చెబుతున్నాను. ప్రతిసారీ బిగ్‌బాస్‌ షో విభిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్‌ వద్ద బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌కు రికార్డులను సృష్టిస్తూ ఓపెనింగ్‌లూ వచ్చాయి. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌తో నాన్‌స్టాప్‌గా వినోదం అందుతుంది’ అని అన్నారు.
 
"బిగ్ బాస్" నాన్ స్టాప్ "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3h9CHBT
 
Content Produced by: Indian Clicks, LLC


More Telugu News