థాంక్యూ సర్.. లక్షల సార్లు ప్రోత్సాహాన్నిస్తుంది: ప్రధాని మోదీ అభినందనలపై కిలీపాల్ స్పందన
- 'మన్ కీ బాత్' కార్యక్రమంలో కిలీ పాల్ ను గుర్తు చేసిన ప్రధాని
- భారతీయ పాటలతో చేస్తున్న వీడియోలకు ప్రశంసలు
- ప్రధాని ప్రశంసలకు ఉబ్బితబ్బిబ్బవుతున్న కిలీపాల్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలకు టాంజానియాకు చెందిన కిలీ పాల్ ముగ్ధుడయ్యాడు. మోదీకి ధనవ్యాదాలు తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. గత ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ కిలీ పాల్, ఆయన సోదరి నీమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం తెలిసిందే.
వివిధ భారతీయ భాషల్లో ప్రజాదరణ పొందిన పాటలకు వారు తమదైన రీతిలో డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీస్తున్నారని, ఇది వారిని పాప్యులర్ చేయడమే కాకుండా, నూతన తరాలకు భారతదేశ వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. యువత పాప్యులర్ పాటలకు తమదైన రీతిలో డ్యాన్స్ చేస్తూ వీడియోలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఒక భాషకు చెందిన వారు మరో భాషకు చెందిన పాటలకు డ్యాన్స్ చేయాలని సూచించారు. తద్వారా ఏక్ భారత్, శ్రేష్ట భారత్ అనుభవం అవుతాయన్నారు.
దీనికి స్పందించిన కిలీపాల్ ‘‘నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్యూ సర్ నరేంద్ర మోదీజీ. ఈ అందమైన వార్త విని నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇది నాకు మిలియన్ టైమ్స్ ప్రోత్సాహాన్నిస్తుంది’’ అని పోస్ట్ పెట్టాడు.