ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు మరో 3 భార‌త వాయుసేన విమానాలు

  • భార‌తీయుల‌ను తీసుకొచ్చేందుకు భారీ ఆప‌రేష‌న్
  • ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు చేరుకున్న భార‌తీయులు
  • హిందోన్ ఎయిర్బేస్ నుంచి కాసేప‌ట్లో బ‌య‌లుదేర‌నున్న 3 విమానాలు
  • పోలండ్, హంగెరీ, రొమేనియాకు చేరుకుంటాయ‌న్న అధికారులు
ర‌ష్యా దాడులు చేస్తోన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ లోని భార‌తీయుల‌ను త‌ర‌లించేందుకు భార‌త్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యుద్ధ విమానాలను కూడా వాడుతోంది. ఉక్రెయిన్ నుంచి స‌రిహ‌ద్దు దేశాల‌కు భార‌తీయుల‌ను రోడ్డు, రైలు మార్గాల ద్వారా త‌ర‌లించిన భార‌త్ వారిని అక్క‌డి నుంచి విమానాల్లో తీసుకొస్తోంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మరో 3 వాయుసేన విమానాలను పంపుతోంది. 

భార‌త‌ వాయుసేనకు చెందిన మూడు ర‌వాణా విమానాలు హిందోన్ ఎయిర్బేస్ నుంచి  పోలండ్, హంగెరీ, రొమేనియాకు కాసేప‌ట్లో బ‌య‌లుదేర‌నున్న‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మ‌రోవైపు, సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు పలు సామగ్రితో బయలుదేరి వెళ్లిందని వివ‌రించారు. అక్క‌డి భార‌తీయుల‌కు సాయ‌ప‌డేలా ఆయా విమానాల్లో టెంట్లు, బ్లాంకెట్ల వంటి సామగ్రిని కూడా పంపుతున్నార‌ని చెప్పారు.


More Telugu News