రష్యా ఒప్పుకుంది.. ఉక్రెయిన్‌లోని భారతీయుల తరలింపు మరింత సులభం
- ఐరాసలో యుద్ధ సంక్షోభంపై భారత్ తటస్థ వైఖరి
- హర్షం వ్యక్తం చేస్తూ ఆహ్వానించిన రష్యా
- రష్యా మీదుగా భారతీయుల తరలింపునకు ఓకే
రష్యా నుంచి బుధవారం విడుదలైన ఓ ప్రకటన ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన భారతీయుల తరలింపును మరింతగా సులభతరం చేయనుందనే చెప్పాలి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్య సమితిలో తటస్థ వైఖరిని భారత్ ప్రకటించడం పట్ల రష్యా హర్షం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సంక్షోభాన్ని భారత్ చాలా లోతుగా అర్థం చేసుకుందని కూడా రష్యా కొనియాడింది. ఈ నేపథ్యంలో రష్యాకు భారత్ చేసిన ఓ వినతికి రష్యా అప్పటికప్పుడే అంగీకరించింది. ఈ మేరకు భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత కల్పిస్తామని రష్యా పేర్కొంది. ఖర్కివ్, తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం తాము అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను రష్యా మీదుగా అత్యవసరంగా తరలించాలన్న ఇండియా అభ్యర్థనను తాము స్వీకరిస్తున్నట్టు చెప్పింది.
అంతేకాదు, భారత్‌తో రష్యా వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉన్నట్టు అలిపోవ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌తో అంతకు ముందు చేసుకున్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరాకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. రష్యా వైఖరిలో మార్పుతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మరింత సులభతరం కానుంది.