నాకు యాక్టింగ్ రాదని సూర్య నా ముఖాన్నే చెప్పేశాడు: రానా
- సూర్యకి నేను మొదటినుంచీ వీరాభిమానిని
- ఆయన్ని కలిశాక మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది
- నాలుగు గంటలసేపు క్లాస్ తీసుకున్నాడు
- ఆ క్లాస్ పీకడం వల్లే ఒక భళ్లాలదేవుడు వచ్చాడన్న రానా
సూర్య కథానాయకుడిగా పాండిరాజ్ రూపొందించిన 'ఈటి' ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ముఖ్య అతిథిగా వచ్చిన రానా మాట్లాడాడు. 'పితామగన్' సినిమా నుంచి నేను సూర్యకు అభిమానిని. ఆ సినిమాలో హీరో సూర్య అనే సంగతి కూడా అప్పటికి నాకు తెలియదు. అయినా ఆయన నా అభిమాన హీరో అని చెప్పుకున్నాను.
ఆ తరువాత కొంతకాలానికి నేను సూర్యను కలిశాను .. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. నేను కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఒక పదేళ్ల క్రితం అనుకుంటాను. నేను చేసిన ఒక సినిమాను ఎడిటింగ్ రూములో చూసిన సూర్య, ఆ తరువాత నన్ను తన కారులో కూర్చొబెట్టుకుని నాలుగు గంటల పాటు హైదరాబాద్ అంతా తిప్పాడు.
యాక్టింగ్ అంటే ఇది కాదు .. యాక్టింగ్ చేయడం ఇలా కాదు అంటూ క్లాస్ పీకాడు. ఆ రోజున ఆయన అలా క్లాస్ పీకడం వల్లనే ఒక భళ్లాలదేవుడు .. ఒక డేనియల్ శేఖర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు" అని చెప్పాడు. రానా అలా చెబుతున్నప్పుడు మైక్ లాక్కోడానికి ప్రయత్నించిన సూర్య, ఆ తరువాత ఆయన జర్నీ చూసి తాను గర్వపడుతున్నట్టుగా చెప్పాడు.