సాటి క్రికెటర్ మృతికి సంతాపం... ఆ తర్వాత 12 గంటలకే వార్న్ మృతి
- శుక్రవారం ఉదయం రామ్ మార్ష్ గుండెపోటుతో మృతి
- మార్ష్‌కు నివాళి అర్పిస్తూ షేన్ వార్న్ ట్వీట్
- ఆ తర్వాత 12 గంటలకే గుండెపోటుతో వార్న్ మృత్యువాత
జెంటిల్మన్ గేమ్ క్రికెట్‌లో దిగ్గజంగా ఎదిగిన ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని విషాదంలో ముంచేసింది. కాసేపటి క్రితం గుండెపోటుతో వార్న్ మృతి చెందాడన్న వార్త క్రీడాలోకాన్ని షాక్‌కు గురి చేసింది. అయితే శుక్రవారం ఉదయం తన దేశానికే చెందిన సీనియర్ మోస్ట్ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రామ్ మార్ష్ మృతికి సంతాపం తెలిపిన 12 గంటల్లోనే వార్న్ మృతి చెందాడు. సాటి క్రికెటర్‌కు కన్నీటి నివాళి అర్పించిన కొన్ని గంటల్లోనే వార్న్ మృతి చెందడం నిజంగా పెద్ద విషాదమే.
శుక్రవారం ఉదయం రామ్ మార్ష్ (72) గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మార్ష్ మృతి వార్త తెలిసిన వెంటనే.. ఆయనకు నివాళి అర్పించేందుకు ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వార్న్.. మార్ష్ గొప్పతనాన్ని, తమతో పాటు యువ క్రీడాకారులకు ఆయన ఎలా మార్గదర్శనం చేశాడన్న విషయాన్ని గుర్తు చేస్తూ లెంగ్తీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన 12 గంటల్లోనే మార్ష్ మాదిరే వార్న్ కూడా గుండెపోటుతోనే మరణించడం క్రీడాలోకాన్ని కన్నీరు పెట్టిస్తోంది.