'కేజీఎఫ్ 2' నుంచి గ్లింప్స్ వచ్చేస్తోంది!
- సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్'
- భారీ బడ్జెట్ తో సిద్ధమైన సీక్వెల్
- కీలకమైన పాత్రలో సంజయ్ దత్
- ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక కన్నడ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడం .. అనూహ్యమైన వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంతం .. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను అంతా ఆదరించారు .. భారీ విజయాన్ని ముట్టజెప్పారు.
దాంతో ఈ సినిమాకి సీక్వెల్ ను సిద్ధం చేశారు. ఈ సారి ఈ సినిమాకి సంజయ్ దత్ క్రేజ్ కూడా తోడవుతోంది. ఈ సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. కరోనా కారణంగా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.
ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టుగా కొంతసేపటి క్రితం పోస్టర్ ను వదిలారు. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. రవీనా టాండన్ .. శ్రీనిధి శెట్టి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.