భారీ విడుదలకు సిద్ధమైన పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం
- జేమ్స్ విడుదలకు అన్ని ఏర్పాట్లు
- ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై ప్రదర్శన
- కన్నడ, తెలుగు సహా ఐదు భాషల్లో
- సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్
దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన యాక్షన్ సినిమా ‘జేమ్స్’ విడుదలకు రంగం సిద్ధమైంది. రాజ్ కుమార్ జయంతి అయిన మార్చి 17న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై విడుదల చేయనున్నారు.
ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. దీని ప్రకారం 12 ఏళ్లలోపు పిల్లలు కూడా తల్లిదండ్రుల సమక్షంలో చూడొచ్చు. యాక్షన్ సినిమా కనుక ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ (46) గుండెపోటుతో మరణించడం తెలిసిందే.
ఇక ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 400 థియేటర్లలో జేమ్స్ ప్రదర్శనకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటించింది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, పత్తికొండ కిశోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.