రణ భూమి సరిహద్దులకు అమెరికా ఉపాధ్యక్షురాలు
- పోలండ్, రొమేనియాల పర్యటనకు హ్యారిస్
- పోలండ్, కెనడా ప్రధానులతో ప్రత్యేక భేటీ
- రొమేనియాలోని ఉక్రెయిన్ శరణార్థులకు పరామర్శ
ఓ వైపు ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించాల్సిందేనన్న కసితో రష్యా సాగుతోంది. మరోవైపు తన మీదకు దండెత్తి వస్తున్న రష్యా సేనలకు ఉక్రెయిన్ సైనికులు, పౌరులు చుక్కలు చూపిస్తున్నారు. ఇరు దేశాల పోరుతో ఉక్రెయిన్‌తో పాటు ఆ దేశ సరిహద్దులు బాంబుల మోతలతో దద్దరిల్లిపోతున్నాయి.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య రణ భూమికి చేరువలోకి అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న కమలా హ్యారిస్ వెళుతున్నారు. ఉక్రెయిన్‌తో సరిహద్దును పంచుకుంటున్న పోలండ్, రొమేనియాల్లో పర్యటించనున్న హ్యారిస్.. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ను వీడి రొమేనియాలో శరణార్థులుగా మారిపోయిన ఉక్రేనియన్లతో మాట్లాడనున్నారు.
ఈ మేరకు కమలా హ్యారిస్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైపోయింది. బుధవారం రాత్రి పోలండ్, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరనున్న హ్యారిస్.. గురువారం ఉదయం పోలండ్ రాజధాని వార్సా చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రులతో వేర్వేరుగా భేటీ అవుతారు. ఈ భేటీలో రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులను ఆమె తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ సమయానికి వార్సాలోనే ఉండనున్న కెనడా ప్రధానితోనూ హ్యారిస్ భేటీ కానున్నారు.అనంతరం రొమేనియా వెళ్లనున్న హ్యారిస్ అక్కడి ఉక్రెయిన్ శరణార్థులతో మాట్లాడతారు.