ఆర్ఆర్ఆర్ నుంచి 'ఎత్తర జెండా' ప్రోమో రిలీజ్

  • చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
  • ఇటీవల ఎత్తర జెండా పాట గురించి వెల్లడించిన చిత్రబృందం
  • పూర్తి పాట ఈ నెల 14న రిలీజ్
ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ డేట్ సమీపించే కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం క్రమం తప్పకుండా అప్ డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ లో ఉద్వేగం పెంచుతోంది. 

ఇటీవల 'ఎత్తర జెండా' అనే ఉత్తేజభరిత గీతం గురించి వెల్లడించిన చిత్రబృందం ఆ పాట తాలూకు ప్రోమో వీడియోను నేడు పంచుకుంది. పూర్తి పాట ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పాటకు కీరవాణి బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.


More Telugu News