గులాబీ బంతితో విజృంభించిన భారత బౌలర్లు... శ్రీలంక విలవిల
- బౌలర్లకు సహకరిస్తున్న బెంగళూరు పిచ్
- టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 252 ఆలౌట్
- 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంక
- చెరో రెండు వికెట్లు తీసిన బుమ్రా, షమీ
- అక్షర్ పటేల్ కు ఓ వికెట్
బెంగళూరు టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను 252 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. మొదటి రోజు భోజన విరామానంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను టీమిండియా పేసర్లు హడలెత్తించారు. బుమ్రా, షమీ చెరో రెండు వికెట్ల తీసి లంకను దెబ్బకొట్టారు. దాంతో ఆ జట్టు 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే, సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ (20 బ్యాటింగ్), చరిత్ అసలంక (5) జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నట్టే కనిపించింది. అయితే అది కాసేపే అయింది. అసలంకను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో లంక కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 50 పరుగులు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 202 పరుగులు వెనుకబడి ఉంది.