వినియోగంలో ‘విస్కీ’యే నెంబర్ 1.. పట్టణ వాసుల ఓటు బీరుకే.. తాజా సర్వే!

  • 41-56 ఏళ్ల వారికి విస్కీ ఇష్టం
  • ఆలోపు వయసున్న వారు బీర్ వైపు మొగ్గు
  • వైన్ కు మహిళల మద్దతు
  • విస్కీ ప్రియుల్లో మెజారిటీ అప్పుడప్పుడు సేవించే వారే
  • యూగవ్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి
  విస్కీ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అయినప్పటికీ, పట్టణ వాసులు బీరు తాగేందుకే ఇష్టపడుతున్నారు. విస్కీ వినియోగంలో భారత్ తర్వాత అమెరికా రెండో స్థానంలో ఉంది. అయినా అమెరికాతో పోలిస్తే భారత్ లో విస్కీ వినియోగం మూడు రెట్లు అధికం. కానీ, పట్టణాలకు వచ్చే సరికి కేవలం 16 శాతం మంది తమకు విస్కీ అంటే ఇష్టమని చెప్పారు. యూగవ్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేతో ఇలాంటి ఆసక్తికర అంశాలు ఎన్నో వెల్లడయ్యాయి. 

పట్టణ వాసుల్లో బీరు, వైన్ ను తాగి చూశామని 55 శాతం మంది చెప్పగా.. 22-25 శాతం మంది తమకు ఇష్టమైన డ్రింక్ గా బీరు, వైన్ కు ఓటేశారు. జెన్ ఎక్స్ గ్రూపులోని మగవారు (41-56 ఏళ్లు) విస్కీని ఇష్టపడుతుంటే.. జెన్ జెడ్ (1997-2012 మధ్య జన్మించిన వారు), మిలీనియల్స్ (26-41) వయసులోని వారికి బీరు నచ్చుతోంది. 

ఇక దేశంలో వైన్ వినియోగం చాలా తక్కువ. అందులోనూ మహిళలు ఎక్కువగా వైన్ ను ఇష్టపడుతున్నారు. విస్కీని ఇష్టపడే వారిలో 86 శాతం మంది అప్పుడప్పుడు సేవించేవారే. 22 శాతం మందే రోజువారీ విస్కీ తాగుతున్నారు. ఆఫీసు పార్టీలు, ఫ్రెండ్స్ పార్టీల్లో విస్కీ గుబాళింపులే ఎక్కువగా ఉంటున్నాయి. తీసుకునే ఆల్కహాల్ లో కేలరీలు తమకు ప్రధానమని ప్రతి ఐదుగురిలో ముగ్గురు చెప్పారు. 

ఆయా వ్యక్తుల అభిరుచులు..  
ఆల్కహాల్  
పట్టణాల్లో తాగి చూసిన వారు 
ఇష్టపడే వారు (శాతంలో)
బీరు5624
వైన్5522
వోడ్కా4711
విస్కీ4616
రమ్387
బ్రీజర్327
బ్రాందీ322
కాక్ టెయిల్స్111



More Telugu News