ప్రతి ఒక్కరు మీ నాయకుడిలా శవ రాజకీయాలు చేస్తారనుకోవడం మీ మూర్ఖత్వం: బుగ్గనపై బుద్ధా ధ్వజం
- జంగారెడ్డిగూడెం మరణాలపై మాటల యుద్ధం
- బాధితులను టీడీపీ ప్రభావితం చేస్తోందన్న బుగ్గన
- జగన్ ఓదార్పు యాత్ర ఎలా చేశాడో అందరికీ తెలుసన్న వెంకన్న
- 'బుర్ర కథల బుగ్గన కట్టుకథలు' అంటూ అయ్యన్న ఎద్దేవా
జంగారెడ్డిగూడెం మరణాల అంశంలో ఏపీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. టీడీపీ నేతలు జంగారెడ్డిగూడెం వెళ్లి తాము లక్ష ఇస్తామని, ప్రభుత్వంతో మరికొంత ఇప్పిస్తామని అక్కడి వారిని ప్రభావితం చేస్తున్నారని బుగ్గన ఆరోపించారు.
దీనిపై బుద్ధా స్పందిస్తూ... జగన్ ఓదార్పు యాత్ర ఎలా చేశాడో, ఎవరికెంత ఇచ్చి శవ రాజకీయాలు చేశాడో రాష్ట్రం మొత్తం చూసింది బుర్రకథల బుగ్గన గారూ అంటూ విమర్శించారు. అందరూ మీ నాయకుడిలా శవ రాజకీయాలు చేస్తారనుకోవడం మీ మూర్ఖత్వం అని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని బుద్ధా అన్నారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా బుగ్గనపై మండిపడ్డారు. బుర్ర కథల బుగ్గన కట్టుకథలు చెబుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా నిస్సిగ్గుగా నవ్వుతున్నారో చూడండి అంటూ ఓ వీడియోను పంచుకున్నారు.