తనకు ఓ రోడ్ మ్యాప్ లేదని పవన్ నిజం చెప్పారు: బొత్స వ్యంగ్యం

  • జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ వ్యాఖ్యలు
  • రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో చెప్పలేదని బొత్స విమర్శలు
  • ఏంచేస్తారో చెబితే ప్రజలు ఆలోచిస్తారని వ్యాఖ్య  
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.  ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో పవన్ చెప్పలేకపోయారని విమర్శించారు. ఏం చేస్తారో స్పష్టంగా చెబితే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు. సినిమా డైలాగులు వినేందుకు చాలా బాగుంటాయని అన్నారు. అయితే, పవన్ ప్రసంగంలో ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కటీ లేదని పెదవి విరిచారు. 

అసలు, వైసీపీని ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారని బొత్స విమర్శించారు. ఏ వైసీపీ నాయకుడు రౌడీయిజం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. రౌడీలు, గూండాలు అనే పదాలు సినిమాల్లో బాగుంటాయని అభిప్రాయపడ్డారు. తనకంటూ ఓ రోడ్ మ్యాప్, ఆలోచన, అవగాహన లేదని పవన్ నిజం చెప్పారని బొత్స ఎద్దేవా చేశారు. ఏపీలో వైసీపీని ఓడించేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచిచూస్తున్నామని పవన్ కల్యాణ్ నిన్న పేర్కొన్న సంగతి తెలిసిందే.


More Telugu News