ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం వద్ద రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల
- ప్రమోషన్ ఈవెంట్లు ముమ్మరం
- దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రాజమౌళి, తారక్, చరణ్
- గుజరాత్ లోని కెవాడియాలో ఆర్ఆర్ఆర్ సందడి
ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా వీరు ముగ్గురు గుజరాత్ లోని కెవాడియా వచ్చారు. ఇక్కడి సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద కొలువుదీరిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్)ని సందర్శించారు.
ఆర్ఆర్ఆర్ టీమ్ రాకతో అక్కడ కూడా సందడి నెలకొంది. మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దాంతో రాజమౌళి, చరణ్, తారక్ తమ చిత్రం గురించి వారికి వివరించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
కాగా, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ బరోడా ఎయిర్ పోర్టు నుంచి కెవాడియా వెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలను ఉపయోగించారు. ఆ కార్లపై ఆర్ఆర్ఆర్ పేరు, రిలీజ్ డేట్, హీరోల ముఖ చిత్రాలు ముద్రించారు.
.