అసెంబ్లీలో సీఎం జగన్ ను కలిసిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు

  • ఉక్రెయిన్ పై రష్యా బలగాల దాడులు
  • చిక్కుకుపోయిన వేలాది విద్యార్థులు
  • ఎన్నో చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  • విద్యార్థులను స్వదేశానికి తరలించిన కేంద్రం
  • సీఎం జగన్ కు జ్ఞాపికలు బహూకరించిన విద్యార్థులు
రష్యా సేనలు ఉక్రెయిన్ పై దండెత్తిన నేపథ్యంలో, వేలాది మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చారు. తీవ్ర ప్రయాసల నడుమ భారత్ చేరుకున్న విద్యార్థుల ఆనందం అంతాఇంతా కాదు. వారిలో ఏపీకి చెందిన వారు కూడా వందల మంది ఉన్నారు. ఏపీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి పొరుగుదేశాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులందరూ క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేందుకు కృషి చేసింది. 

ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థులు నేడు సీఎం జగన్ ను కలిశారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం జగన్ చాంబర్ విద్యార్థులతో కిటకిటలాడింది. ముఖ్యమంత్రికి విద్యార్థులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వీయ చిత్రపటాన్ని బహూకరించారు. మరికొన్ని జ్ఞాపికలు కూడా అందజేశారు. విద్యార్థులతో సీఎం జగన్ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


More Telugu News