ప్రభాస్ ముఖ్యఅతిథిగా 'కేజీఎఫ్ 2' ప్రీరిలీజ్ ఈవెంట్!

  • యష్ హీరోగా 'కేజీఎఫ్ 2'
  • కీలకపాత్రలో సంజయ్ దత్ 
  • ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్    
ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. అన్ని థియేటర్లలోను కదలకుండా కాసుల వర్షం కురిపించింది. అందువలన సహజంగానే 'కేజీఎఫ్ 2'పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 

యశ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సంజయ్ దత్ కీలకమైన పాత్రను పోషించారు. అందువలన ఈ సినిమా మరింత భారీతనాన్ని సంతరించుకుంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి సినిమా అయిన 'సలార్'కి ప్రశాంత్ నీల్ దర్శకుడు. అందువలన ప్రభాస్ ఈ వేడుకకి రావడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే 'సలార్' చాలావరకూ చిత్రీకరణను జరుపుకుందనే సంగతి తెలిసిందే.


More Telugu News