గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీం.. థ్యాంక్స్ చెప్పిన ఎంపీ సంతోష్
- ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో ఫుల్ బిజీగా ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన వైనం
- ఆర్ఆర్ఆర్ టీంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ సంతోష్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు తమ తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా సాగుతున్నారు. అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ వారు ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళిలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురికి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో వారి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించాలని కూడా సంతోష్ కుమార్ స్పెషల్ విషెస్ చెప్పారు.