ఇక మార్కెట్ కు.. ఐఐటీ హైదరాబాద్ చౌక వెంటిలేటర్!

  • ‘జీనవలైట్’ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం
  • ఒక్కో పరికరం ధర రూ.4 లక్షలు
  • దిగుమతి ధరతో పోలిస్తే సగం తక్కువ
  • పలు అత్యాధునిక ఫీచర్లు
ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలైన, నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ద్వారా పనిచేసే ‘జీవన్ లైట్’ను ఐఐటీ హైదరాబాద్ వాణిజ్య ఉత్పత్తికి వీలుగా ఆవిష్కరించింది. ఇక మీదట దీన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయనున్నారు.

జీవన్ లైట్ వెంటిలేటర్ ధర రూ.4 లక్షలు. కానీ, ఇదే మాదిరి దిగుమతి చేసుకునే వెంటిలేటర్ ఒక్కోదానికి రూ.10-15 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దిగుమతి చేసుకునే బదులు స్థానికంగానే మరిన్ని వెంటిలేటర్లను సమకూర్చుకునే వెసులుబాటు తాజాగా లభించింది. కరోనా రెండో విడతలో ఐఐటీ హైదరాబాద్ ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీ ‘ఏయిరో బయోసిస్ ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్’ దీన్ని అభివృద్ధి చేసింది. 

లిథియం అయాన్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్ యాప్ తో నియంత్రించుకోవచ్చు. శ్వాస రేటు, ఇతర ఊపిరితిత్తుల పనితీరును గణాంకాల రూపంలో తెలియజేస్తుంది. దీనికి ఆక్సిజన్ సిలిండర్ అనుసంధానించి ఉంటుంది. గాలిలోని ఆక్సిజన్ ను సైతం తీసుకుని, రోగికి అందించగలదు.


More Telugu News