చెన్నై జట్టు సారథిగా జడేజా ఎంపికపై స్పందించిన పీటర్సన్
- ధోనీలాగే జడేజా కూడా ప్రశాంతంగా ఉండే ఆటగాడు
- ధోనీలాగే చెన్నై టీమ్‌ను నడిపిస్తాడు
- మైదానంలో చురుగ్గా ఉంటాడు
- సరైన నిర్ణయాలు తీసుకుంటాడన్న పీటర్సన్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఎంపిక కావడం పట్ల ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించారు. ధోనీలాగే జడేజా కూడా ప్రశాంతంగా ఉండే ఆటగాడని ఆయన అన్నారు.
జడేజా కూడా ధోనీలాగే చెన్నై టీమ్‌ను నడిపిస్తాడని, మైదానంలో చురుగ్గా ఉంటాడని, సరైన నిర్ణయాలు తీసుకుంటాడని అభిప్రాయపడ్డారు. జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆయన అన్నారు. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనీ తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ఆ టీమ్ భావించి ఉండొచ్చని ఆయన చెప్పారు.
జడేజా గొప్ప ఆటగాడు మాత్రమే కాదని, తెలివైన క్రికెటర్ కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. టీ20ల్లో జడేజా చాలా అనుభవం ఉన్న ఆల్‌రౌండర్ అని ఆయన అన్నారు. ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ మిగతా జట్లను ఓడించి, అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆ జట్టు గత ఏడాది కూడా అంచనాలను తలకిందులు చేసిందని వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో తాను ఆ జట్టును తక్కువగా చేసి చూశానని తెలిపారు. చెన్నై జట్టులో ప్రస్తుతం యువరక్తం ఉందని, సరైన నిర్ణయాలు తీసుకునే గొప్ప క్రికెటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. వారు ప్రత్యర్థులపై నెగ్గగలమన్న నమ్మకంతో ఉన్నారని ఆయన తెలిపారు. సాధారణంగానే టీ20లో పరిస్థితులకు తగ్గట్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సరైన నిర్ణయాలు తీసుకున్న జట్టే గెలుస్తుందని అన్నారు.