ఆటగాళ్లకు రిలీఫ్.. యోయో టెస్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం

  • గుదిబండగా మారనివ్వబోమని వెల్లడి
  • ఆటగాళ్ల మానసిక ఆరోగ్యానికి ముప్పని కామెంట్
  • వారిపై అనవసర ఒత్తిడి పెంచబోమని వివరణ
జట్టులో చోటు దక్కాలంటే మైదానంలోనే కాదు.. యోయో టెస్టులోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఎన్ని అద్భుతమైన గణాంకాలు నమోదు చేసినా.. యోయో టెస్టులో ఫెయిలైతే బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే, చాలా మంది ఆటగాళ్లు ఆ టెస్టులో ఫెయిల్ అయిపోతున్నారు. అందుకు ఇటీవలి పృథ్వీ షా యోయో టెస్ట్ రిజల్టే నిదర్శనం. 

ఈ క్రమంలోనే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యోయో టెస్టులను ఆటగాళ్లకు గుదిబండగా మారనివ్వబోమని స్పష్టం చేసింది. యోయో టెస్టులో విఫలమైతే ఐపీఎల్ లో ఆడనివ్వబోమంటూ ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఆ ప్రకటనపై ప్రస్తుతం సవరణ ఇచ్చింది. 

‘‘యోయో టెస్టులను కష్టంగా మార్చబోం. ఎందుకంటే అది ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చాలా ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నారు. కాబట్టి ఇకపై ఆటగాళ్ల మీద అనవసర ఒత్తిడిని పెంచాలనుకోవట్లేదు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.


More Telugu News