సొంత ఊర్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి... వీడియో ఇదిగో!

  • భకిత్యాపూర్ లో నితీశ్ పర్యటన
  • ఓ విగ్రహావిష్కరణకు హాజరు
  • వెనుక నుంచి వచ్చి దాడి చేసిన యువకుడు
  • యువకుడ్ని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై అనూహ్య రీతిలో దాడి జరిగింది. అది కూడా ఆయన స్వగ్రామంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన సొంతూరు భకిత్యాపూర్ విచ్చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని స్థానిక ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణకు విచ్చేసిన నితీశ్ కుమార్ నివాళులు అర్పిస్తుండగా, ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చి ఆయనపై దాడి చేశాడు. 

ఈ ఘటనతో అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది ముందుకొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ యువకుడు మతిస్థిమితం లేనివాడని భావిస్తున్నారు. ఏదేమైనా, ఎంతో భద్రత ఉండే సీఎంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News