నయీం కేసులో కీలక పరిణామం.. రూ.150 కోట్ల ఆస్తుల సీజ్
- షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌లో నయీం మృతి
- తాజాగా ఈ కేసులో ఐటీ శాఖ జోక్యం
- బినామీల పేరిట ఉన్న ఆస్తుల సీజ్
- నయీం భార్య హాసినికి నోటీసులు
తెలంగాణలో కలకలం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నయాంకు చెందిన రూ.150 కోట్ల విలువ చేసే 10 ఆస్తులను సీజ్ చేస్తూ ఆదాయపన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్తులన్నీ నయీం బినామీల పేర్లపై ఉన్నట్లు సమాచారం. ఆస్తులను సీజ్ చేసిన ఐటీ శాఖ..నయీం భార్య హాసినికి నోటీసులు కూడా జారీ చేసింది.
పోలీసు శాఖలోని పలువురు కీలక అధికారులతో స్నేహ సంబంధాలు కొనసాగించిన నయీం పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డట్టుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నయీంపై మరింత మేర ఆరోపణలు రావడంతో అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో నయీం కోసం వేట సాగించిన తెలంగాణ పోలీసులు అతనిని షాద్ నగర్‌లో ఎన్‌కౌంటర్ లో హతం చేసిన సంగతి తెలిసిందే.