చంద్రబాబుకు ఇప్పుడు వచ్చింది విరామమే.. త్వరలోనే మళ్లీ సీఎం అవుతారు: అశ్వనీదత్

  • హైదరాబాద్ కు ఈ స్థాయిలో ఆదాయం రావడానికి బీజం వేసింది చంద్రబాబే
  • ఐటీ ఉద్యోగులు ఇప్పటికీ చంద్రబాబును తలుచుకుంటారు
  • రాష్ట్రానికి, దేశానికి దిక్సూచి తెలుగుదేశం పార్టీ అన్న అశ్వనీదత్ 
అతి త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నిర్మాత అశ్వనీ దత్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి, ఈ స్థాయిలో నగరానికి ఆదాయం రావడానికి బీజం వేసింది చంద్రబాబేనని కొనియాడారు. 

ఇప్పటికీ హైదరాబాదులో పని చేస్తున్న ఎంతో మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబును తలుచుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు ఒక పొలిటీషియన్ కాదని, ఒక స్టేట్స్ మెన్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారని చెప్పారు. చంద్రబాబు అధికారానికి ఇప్పుడు వచ్చింది తాత్కాలిక విరామమే కానీ, విరమణ కాదని అన్నారు. 

రాష్ట్రానికి, దేశానికి దిక్సూచి తెలుగుదేశం పార్టీనే అని చెప్పారు. మన దేశంలో తొలిసారి వృద్ధాప్యపు పింఛన్ ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని అశ్వనీ దత్ అన్నారు. సంక్షేమం అంటే ఏమిటో దేశానికి చెప్పింది ఎన్టీఆర్ అని తెలిపారు. రాబోయే రోజుల్లో కంభంపాటి రామ్మోహన్ రావును మంచి పదవిలో చూస్తామని చెప్పారు. రామ్మోహన్ కు శత్రువులు లేరని, అందరూ మిత్రులేనని అన్నారు.


More Telugu News