రీ ఎంట్రీ ఇస్తున్న 'ఎగిరే పావురమా' బ్యూటీ లైలా!
- నిన్నటితరం బ్యూటీగా లైలా
- 'ఎగిరే పావురమా'తో పరిచయం
- వివాహం తరువాత నటనకు దూరం
- 'సర్దార్' సినిమాతో రీ ఎంట్రీ
తెలుగులో లైలా చేసిన సినిమాలు చాలా తక్కువ. మొదటి సినిమా అయిన 'ఎగిరే పావురమా' .. ఆ తరువాత చేసిన 'పెళ్లి చేసుకుందాం' సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు బాగా గుర్తున్నాయి. ఆకర్షణీయమైన ఆమె నవ్వుకు అప్పట్లో కుర్రాళ్లంతా కూడా ఆమె అభిమానులుగా మారిపోయారు. తెలుగులో చేస్తూనే ఆమె కోలీవుడ్ వైపు వెళ్లింది.
తమిళంలో కొంతకాలం పాటు వరుస సినిమాలు చేస్తూనే, కన్నడ .. మలయాళ సినిమాల్లోను మెరిసింది. వివాహమైన తరువాత సినిమాలను దూరం పెట్టేసింది. అలా తెలుగు .. తమిళ భాషల్లో ఆమె తెరపై కనిపించక 15 ఏళ్లు అవుతోంది. ఇంతకాలానికి ఇప్పుడు ఆమె తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.
తమిళంలో కార్తి హీరోగా 'సర్దార్' సినిమా రూపొందుతోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సీనియర్ కార్తి సరసన లైలా కనిపించనుంది. ఇక జూనియర్ కార్తి జోడీగా రాశి ఖన్నా అలరించనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో రజీషా విజయన్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.