రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే తాప్సీతో నటించే అవకాశాన్ని కోల్పోయాను: చిరంజీవి
- 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాలో తాప్సీ నటన అద్భుతం
- తాప్సీలాంటి వాళ్లను చూసినప్పుడు రాజకీయాల్లోకి ఎందుకెళ్లానా అనిపిస్తుంది
- తాప్సీతో ఒక సినిమా చేసే అవకాశాన్ని యంగ్ డైరెక్టర్లకు కల్పిస్తున్నా
'మిషన్ ఇంపాజిబుల్' సినిమా తాను చూశానని... చాలా అద్భుతంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ చిత్రంలో తాప్సీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రశంసించారు. తాప్సీ నటించిన 'పింక్', 'బద్లా' సినిమాలు చూశానని... 'ఝుమ్మంది నాదం' చిత్రంలో ఎంతో క్యూట్ గా ఉన్న తాప్సీనేనా ఈ పాత్రలను పోషించింది అని తాను ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పారు.
'ఝుమ్మంది నాదం' సినిమాను అప్పట్లో చూసి ఎంతో బాగుందని అనుకున్నానని... ఆ సమయంలో తాను రాజకీయాల్లోకి వెళ్లిపోవడం వల్ల తాప్సీతో కలిసి నటించే అవకాశాన్ని కోల్పోయానని అన్నారు. ఒక్కోసారి ఇలాంటి వాళ్లను చూసినప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా? అని అనిపిస్తుంటుందని చెప్పారు. తాప్సీతో ఒక సినిమా చేసే అవకాశాన్ని యంగ్ డైరెక్టర్లకు ఇస్తున్నానని తెలిపారు.
ఇక్కడ ఉన్న యంగ్ డైరెక్టర్ల పేర్లను డ్రాలో వేసి, ఎవరి పేరు వస్తే వారికి అవకాశం ఇస్తానని సరదాగా అన్నారు. 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించారు.