'టైగర్ నాగేశ్వరరావు'లో రవితేజ జోడీగా నుపుర్ సనన్!

  • 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ
  • సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్
  • ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ 
  • కృతి సనన్ సోదరే నుపుర్ సనన్   
రవితేజ ఎప్పటిలానే వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రామారావు ఆన్ డ్యూటీ' రెడీగా ఉంది. ఆ తరువాత 'ధమాకా' .. 'రావణాసుర' సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగులు జరుగుతూ ఉండగానే ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు.

రవితేజ హీరోగా దర్శకుడు వంశీకృష్ణ 'టైగర్ నాగేశ్వరరావు ' సినిమాను చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ  తేదీన లాంచ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. దాంతో ఈ సినిమాలో కథానాయికగా ఎవరు చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ సినిమాలో హీరోయిన్ గా 'నుపుర్ సనన్' నటిస్తుందన్న విషయాన్ని కొంతసేపటి క్రితం ప్రకటించారు. ఆల్రెడీ బాలీవుడ్ లో  హీరోయిన్ గా దూసుకుపోతున్న కృతి సనన్ సోదరినే ఈ నుపుర్ సనన్. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.


More Telugu News