2, 3 తేదీల్లో అందుబాటులో ఉండండి.. శాఖాధిపతులు, కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదేశం
- శాఖాధిపతులు అమరావతిలో ఉండాలి
- కలెక్టర్లు జిల్లాల కేంద్రాల్లో ఉండాలి
- ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో గురువారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాల కలెక్టర్లకు ఓ కీలక సందేశం పంపారు.
ఏప్రిల్ 2, 3 తేదీల్లో అన్ని శాఖాధిపతులు, కలెక్టర్లు అందుబాటులో ఉండాలని ఆ సందేశంలో సీఎస్ పేర్కొన్నారు. శాఖాధిపతులు అమరావతిలో, జిల్లాల కలెక్టర్లు జిల్లాల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 4న ప్రారంభం కానున్న కొత్త జిల్లాల ప్రారంభం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లకు ఎలాంటి ఆటంకం కలగరాదన్న భావనతోనే సీఎస్ ఈ ఆదేశాలు జారీ చేశారని అధికారిక యంత్రాంగం భావిస్తోంది.