క‌ర్ణాట‌కకు ప్ర‌ముఖుల క్యూ.. నేడు రాహుల్‌, రేపు అమిత్ షా

  • రేపు శ్రీ శివ‌కుమార స్వామీజీ 115 జ‌యంత్యుత్సవం
  • స్వామీజీకి నివాళి అర్పించేందుకు అమిత్ షా క‌ర్ణాట‌క టూర్‌
  • ఇప్ప‌టికే స్వామీజీకి నివాళి అర్పించిన రాహుల్ గాంధీ
ద‌క్షిణాది రాష్ట్రం క‌ర్ణాట‌క‌కు జాతీయ స్థాయి రాజ‌కీయ నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ గురువారం నాడు క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించ‌గా..శుక్ర‌వారం నాడు బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. 

ఇలా వ‌రుస‌గా జాతీయ స్థాయి నేత‌లు క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు రావ‌డానికి.. శుక్ర‌వారం నాడు సిద్ధ‌గంగ మ‌ఠాధిప‌తి శ్రీ శివ‌కుమార స్వామీజీ జ‌యంత్యుత్స‌వమే కార‌ణంగా నిలిచింది. శ్రీ శివ‌కుమార స్వామీజీ 115వ జ‌యంత్యుత్స‌వాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు నివాళి అర్పించేందుకే తాను శుక్ర‌వారం నాడు క‌ర్ణాట‌కకు వ‌స్తున్న‌ట్టు అమిత్ షా పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా గురువారం నాడు సిద్ద గంగ మ‌ఠాన్ని సంద‌ర్శించి శ్రీ శివ‌కుమార స్వామీజీకి నివాళి అర్పించారు.


More Telugu News