ఐఏఎస్‌లకు జైలు శిక్షపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందన ఇదే
- ఐఏఎస్, ఐపీఎస్‌లు కోర్టు మెట్లెక్కుతున్నారు
- సలహాదారుల్లో చాలా మందికి చదువు రాదు
- హైకోర్టు ఆదేశాలు అమలు కావట్లేదంటున్న జేసీ
కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు ఆగ్రహానికి గురై.. జైలు శిక్ష ఖరారు కాగా.. సారీ చెప్పడంతో ఆ శిక్ష కాస్తా సేవగా మారిన వైనం ఏపీ కేడర్‌కు చెందిన 8 మంది ఐఏఎస్ అధికారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయా రాజకీయ పార్టీలు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు.
ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్‌లూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వ్యాఖ్యానించిన జేసీ.. పాలించే నాయకులే సక్రమంగా లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నియమించుకున్న సలహాదారుల్లో చాలా మందికి చదువు రాదని, సంతకాల కోసం మాత్రమే అధికారులను వాడుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టులో ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని జేసీ అన్నారు. కోర్టు తీర్పులు క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.