'ఆర్ఆర్ఆర్'పై న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనంపై రాజమౌళి స్పందన!
- 'బాహుబలి'కి జపాన్ నుంచి ప్రశంసలు వచ్చాయన్న రాజమౌళి
- 'ఆర్ఆర్ఆర్'కి అమెరికా నుంచి ప్రశంసలు వచ్చాయని వెల్లడి
- ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు చాలా ముఖ్యమైనవని వ్యాఖ్య
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు నార్త్ లో సైతం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాపై దేశీయ మీడియా మాత్రమే కాకుండా విదేశీ మీడియా కూడా ప్రశంసలు కురిపించింది.
విదేశీ మీడియా స్పందన గురించి రాజమౌళి మాట్లాడుతూ, అమెరికా కూడా ఈ సినిమాను ప్రశంసిస్తుందని ఊహించలేదని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ తమ సినిమా గురించి రాసిందని... ఇది తనకు హార్ట్ టచింగ్ విషయమని చెప్పారు.
అమెరికాలోని ప్రేక్షకులు కూడా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఆదరిస్తున్నారని అన్నారు. 'బాహుబలి'కి జపాన్ నుంచి ప్రశంసలు వచ్చాయని, 'ఆర్ఆర్ఆర్'కి యూఎస్ నుంచి కూడా వచ్చాయని చెప్పారు. ఏ సినిమాకైనా బాక్సాఫీస్ నంబర్లు చాలా ముఖ్యమైనవే అయినప్పటికీ... ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు కూడా చాలా ముఖ్యమైనవని రాజమౌళి అన్నారు.