రూ.30 వేలకే వన్ ప్లస్ 4కే టీవీ లభ్యం

  • చౌక బ్రాండెడ్ 4కే టీవీ ఇదే
  • ఈ నెల 11 నుంచి విక్రయాలు
  • అమెజాన్, వన్ ప్లస్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అమ్మకాలు
  • ఎస్బీఐ కార్డుపై రూ.2,500 వరకు తగ్గింపు
వన్ ప్లస్ బ్రాండ్ ఫోన్ల గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ప్రీమియం ఫీచర్లను మధ్యస్థ బడ్జెట్ కే అందించడం వన్ ప్లస్ ప్రత్యేకత. చైనాకు చెందిన ఈ బ్రాండ్ కొన్నేళ్ల క్రితమే టీవీల్లోకి అడుగుపెట్టింది. తాజాగా 4కే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని 29,999కే భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యంత స్పష్టతతో చిత్రాలను వీక్షించే అనుభవం ఈ టీవీతో పొందొచ్చని సంస్థ ప్రకటించింది.

వన్ ప్లస్ టీవీ ‘వై15ప్రో’ అనే మోడల్ 4కే టీవీని 43 అంగుళాల తెరతో తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. భారత మార్కెట్లో తక్కువ ధరకు వచ్చిన 4కే బ్రాండెడ్ టీవీ ఇదే. 4కే యూహెచ్ డీ డిస్ ప్లే, గమ్మా ఇంజన్, డాల్బీ ఆటమ్స్ ఆడియో, బెజెల్ లెస్ డిజైన్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్, వన్ ప్లస్ వెబ్ సైట్లు, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ కేంద్రాలు, క్రోమా, రిలయన్స్ డిజిటల్ లో ఈ నెల 11 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. 

ఎస్బీబీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుని కొనుగోలుదారులకు క్రెడిట్ కార్డు చెల్లింపులపై రూ.2,500 వరకు తగ్గింపును వన్ ప్లస్ ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 11 నుంచి 22 మధ్య కొనుగోలు చేసిన వారికి ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.


More Telugu News