గవర్నర్ తమిళిసైతో కేఏ పాల్ భేటీ..తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనన్న పాల్
- కేసీఆర్ పాలన అవినీతిమయంగా ఉందన్న పాల్
- అప్పట్లో జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చానని వ్యాఖ్య
- తెలంగాణకు కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చారని కామెంట్
- తాను విశాఖ పట్నం నుంచి వచ్చానన్న పాల్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ ఈ రోజు సమావేశమయ్యారు. ఆమెతో పలు అంశాలపై చర్చించిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా ఉందని, ఇంత అవినీతిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు.
కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు కళ్లు నెత్తికి ఎక్కాయని, ఆయన అక్రమ పాలనను అంతం చేయడానికే తాను అమెరికా నుంచి వచ్చినట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిశోర్ చెప్పారని కేఏ పాల్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తానే తీసుకు వచ్చానని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు కేసీఆర్ విజయనగరం నుంచి వస్తే, తాను విశాఖపట్నం నుంచి వచ్చినట్లు వివరించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితుల గురించి కేఏ పాల్ మాట్లాడుతూ.. ఏపీ అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. మరో ఇరవై ఏళ్లు ఎవరు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ అప్పు తీరదని ఆయన అన్నారు.