వైద్య రంగాన్ని జగన్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారు: మంత్రి విడదల రజని
- వైద్యారోగ్య శాఖ మంత్రిగా రజని బాధ్యతల స్వీకరణ
- మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వ్యాఖ్య
- నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ
సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏపీ వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు జగన్ ఎవ్వరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని ఆమె అన్నారు. బీసీలు ఎప్పటికీ జగన్ వెంటే ఉంటారని చెప్పారు. కాగా, తెలంగాణకు చెందిన రజని హైదరాబాద్‌లో పుట్టి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. 2018లో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరి, 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు.