7 రోజుల్లో 700 కోట్లు రాబట్టిన 'కేజీఎఫ్ 2'
- ఈ నెల 14న వచ్చిన 'కేజీఎఫ్ 2'
- ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ
- హిందీలో 300 కోట్ల దిశగా పరుగులు
- యశ్ కోసం రంగంలోకి బడా దర్శక నిర్మాతలు
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ 2' తెరకెక్కింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం విశేషం. కన్నడలోనే కాదు .. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తోంది.
హిందీలో ఈ సినిమా 300 కోట్ల దిశ గా దూసుకుపోతోంది. నిన్నటితో ఈ సినిమా విడుదలై వారం రోజులైంది. ఈ 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 700 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. మొదటివారంలో అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాలలో, 'బాహుబలి 2' మొదటిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ' కేజీఎఫ్ 2' నిలిచింది.
ఇక దీనిని ఒక కన్నడ సినిమాగా కాకుండా తెలుగు సినిమాగానే ప్రేక్షకులు భావిస్తూ ఉండటంతో, కన్నడ స్థాయిలోనే తెలుగులోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మరోపక్క, యశ్ కి పాన్ ఇండియా క్రేజ్ రావడంతో ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీపడుతున్నారట. మరి యశ్ ఏ ప్రాజెక్టును ముందుగా లైన్ మీదికి తీసుకుని వస్తాడో చూడాలి.