'భళా తందనాన' రిలీజ్ డేట్ ఖరారు!
- విభిన్న కథా చిత్రంగా 'భళా తందనాన'
- శ్రీవిష్ణు సరసన నాయికగా కేథరిన్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఈ నెల 30వ తేదీన విడుదల
శ్రీవిష్ణు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన 'రాజ రాజ చోర' సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత చేసిన 'అర్జున ఫల్గుణ' ఫ్లాప్ అయినప్పటికీ, మంచి ప్రయత్నం అనిపించుకుంది. ఆయన తాజా చిత్రంగా 'భళా తందనాన' రూపొందింది.
తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. గతంలో 'బాణం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య దంతులూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
శ్రీవిష్ణు సరసన నాయికగా కేథరిన్ అలరించనుంది. రచయితగా శ్రీకాంత్ విస్సా పనిచేసిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని అందించారు. వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి .. రజని కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా 'గరుడ' రామ్ కనిపించనున్నాడు.