ఆ పాత్రకు రామ్ చరణ్ కాకపోతే పవన్ కల్యాణే!: చిరంజీవి

  • చిరంజీవి హీరోగా ఆచార్య
  • కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 29న విడుదల
  • ప్రమోషన్ ఈవెంట్లతో చిరంజీవి బిజీ 
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. కాగా, ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఆసక్తికర అంశం వెల్లడించారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్ 'సిద్ధ' అనే పాత్ర పోషించాడని తెలిపారు. ఒకవేళ 'సిద్ధ' పాత్రకు రామ్ చరణ్ కాకపోయుంటే పవన్ కల్యాణ్ మాత్రమే తమ మదిలో ఉన్నాడని వివరించారు. అయితే ఆ పాత్రను చరణ్ చేస్తే వచ్చే ఫీల్ వేరేగా ఉంటుందని, చరణ్ కాకుండా ఆ పాత్ర ద్వారా అంతటి ఫీల్ ఇవ్వగలిగేది పవన్ కల్యాణ్ ఒక్కడేనని చిరంజీవి స్పష్టం చేశారు. అయితే ఆ అవసరం రాలేదని, రామ్ చరణ్ తోనే 'సిద్ధ' పాత్ర చేయించామని పేర్కొన్నారు.


More Telugu News