డూప్లెసిస్ భార్యకు ఆ శారీ ఎవరిచ్చారు..? అనుష్క ఇచ్చిందేనా అది..?

  • మ్యాక్స్ వెల్ వివాహానికి డూప్లెసిస్ దంపతులు హాజరు
  • చీర కట్టులో కనిపించిన డూప్లెసిస్ భార్య
  • ఆకుపచ్చని చందేరి చీర ధారణ
  • 2018లో ఇలాంటి చీరలోనే కనిపించిన అనుష్క శర్మ
కొన్ని దృశ్యాలు ఎన్నో సందేహాలకు, చర్చకు తావిస్తాయి. అటువంటిదే ఇది కూడా. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్, భారత సంతతికి చెందిన వినీ రామన్ వివాహ వేడుకలు ఇటీవలే జరిగాయి. దీనికి విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ హాజరయ్యారు. అలాగే, దక్షిణాఫ్రికా దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ సైతం తన భార్య ఇమారితో కలసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

డూప్లెసిస్ కుర్తా, పైజామా వేసుకోగా, ఆయన భార్య ఇమారి చీరకట్టుతో భారతీయ శైలిలో కనిపించారు. వేడుకలో పాల్గొన్న ఫొటోలను తమ పిల్లలతో సోషల్ మీడియా వేదికగా డూప్లెసిస్ దంపతులు పంచుకున్నారు. ఇమారీ కట్టిన చీరను చూసిన ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. అచ్చంగా ఇలాంటి చీరను విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 2018లో కట్టుకుని కనిపించారు. ఆకుపచ్చని పూలతో కూడిన చందేరి చీరలో ‘స్మితా పాటిల్ అవార్డ్ 34వ ఎడిషన్’ సందర్భంగా అనుష్క దర్శనమిచ్చారు. దీంతో నెటిజన్ల మధ్య కామెంట్ల పోటీ ఏర్పడింది.

‘‘నీకు ఆ చీర ఎక్కడిది’’అంటూ అనుష్క అభిమాని ఒకరు ఇమారీని ప్రశ్నించారు. ‘ఆగు.. ఇది అనుష్క కట్టిన చీర కాదు’’అని మరో యూజర్ స్పందించారు. ఇమారి భారతీయ చీరలో కనిపించడాన్ని కొందరు అభినందించారు. ఇమారీ పోస్ట్ ను అనుష్క శర్మ కూడా లైక్ కొట్టారు.


More Telugu News