నేను చనిపోయానంటూ యూట్యూబ్ లో కొందరు వీడియోలు పెడుతున్నారు: సీనియర్ నటి కవిత
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న కవిత
- చట్టరీత్యా చర్యలు తీసుకునేలా చేస్తానని హెచ్చరిక
- ప్రస్తుతం చెన్నైలో జీ టీవీ సీరియల్ షూటింగులో పాల్గొంటున్నానని వివరణ
టాలీవుడ్ సీనియర్ నటి కవిత మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. దీంతో కవిత ఈ వార్తలపై స్పందిస్తూ యూట్యూబ్ చానెళ్లకు వార్నింగ్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, చట్టరీత్యా చర్యలు తీసుకునేలా చేస్తానని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రస్తుతం చెన్నైలో జీ టీవీ సీరియల్ షూటింగులో పాల్గొంటున్నానని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్లు నమ్మకూడదని ఆమె చెప్పారు. తాను చనిపోయానంటూ యూట్యూబ్ లో కొందరు వీడియోలు పెడుతున్నారని, అవి చూసి తన స్నేహితులు, బంధువులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆమె అన్నారు. వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.