'దంగల్' ను దాటేసిన 'కేజీఎఫ్ 2'

  • హిందీ వసూళ్లలో తొలి స్థానంలో నిలిచిన 'బాహుబలి 2'
  • నిన్నటివరకూ రెండో స్థానంలో ఉన్న 'దంగల్'
  • ఆ ప్లేస్ ను ఆక్రమించిన 'కేజీఎఫ్ 2'
  •  ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల మార్కును టచ్ చేయనున్న సినిమా  
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'కేజీఎఫ్ 2' తొలి రోజునే కొత్త రికార్డును నమోదు చేసింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా తన ప్రయాణాన్ని సాగించింది. అంతకుముందున్న రికార్డులను అధిగమిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ వసూళ్లు 'దంగల్' రికార్డును దాటేశాయి.
 
ఇంతవరకూ హిందీలో 511.3 కోట్లను సాధించి 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంటే, 387.4 కోట్ల వసూళ్లతో 'దంగల్' రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డును 'కేజీఎఫ్ 2' అధిగమించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకుని 391.65 కోట్లను రాబట్టిన 'కేజీఎఫ్ 2' .. 'దంగల్' స్థానాన్ని ఆక్రమించేసి, ఆ సినిమాను మూడో స్థానంలోకి నెట్టేసింది. 

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ' కేజీఎఫ్ 2' 1000 కోట్ల మార్కును దాటేసింది. త్వరలో 1100 కోట్ల క్లబ్ లోకి చేరడం కూడా ఖాయమేనని అంటున్నారు. అలాగే బాలీవుడ్ లోను అవలీలగా 400 కోట్ల క్లబ్ లోకి అడుగుపెడుతుందని చెబుతున్నారు. 'కేజీఎఫ్ 2' వసూళ్ల రికార్డులు ఎప్పుడు ఎక్కడ ఆగుతాయనేది చూడాలి.


More Telugu News