భానుడి ప్రతాపంతో తెలంగాణాలో 90 శాతం పెరిగిన బీర్ల అమ్మకాలు
- ఏప్రిల్ నెలలోనే 49,84,285 కేసుల బీర్ల విక్రయం
- ఇతరత్రా మద్యం అమ్మకాల్లో 3 శాతం పెరుగుదల
- సేల్ వాల్యూ ఆధారంగా చూస్తే మద్యం విక్రయాల్లో 19 శాతం పెరుగుదల
ఎండలు మండిపోతున్న వేళ.. తెలంగాణలో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇతరత్రా మద్యం అమ్మకాల్లో పెద్దగా పెరుగుదల లేకున్నా... భానుడి ప్రతాపంతో బీర్ల అమ్మకాలు మాత్రం భారీగా పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే... ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 శాతం మేర బీర్ల అమ్మకాలు పెరిగాయని రాష్ట్ర అబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇతరత్రా మద్యం అమ్మకాలు 3 శాతం పెరగగా.... సేల్ వాల్యూపరంగా అన్నిరకాల మద్యం అమ్మకాలు 19 శాతం మేర పెరిగాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి 49,84,285 కేసుల బీర్లు, 27,69,998 కేసుల ఇతర మద్యం సీసాలు అమ్ముడుపోయాయి. ఎండల తీవ్రతల కారణంగానే మద్యం అమ్మకాలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కరెంటు కోతలు లేకపోవటంతో రాష్ట్రంలో చిల్డ్ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో విస్కీ, బ్రాందీ, ఇతర మద్యం కంటే ఎక్కువ మంది బీర్లు కొనేస్తున్నారు.