అనుకోకుండా పైలట్ కు అస్వస్థత.. ప్రయాణికుడే విమానాన్ని ల్యాండ్ చేసిన దృశ్యం

  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సాయం
  • అర్థం చేసుకుని నడిపిన ప్రయాణికుడు
  • ఫ్లోరిడాలో సురక్షితంగా ల్యాండింగ్
ప్రయాణికుడే విమానాన్ని నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది సినిమాలో కాదండి.. వాస్తవ ప్రపంచంలోనే. ఉన్నట్టుండి పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. దాంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సూచనలతో ప్రయాణికుడే పైలట్ సీటులో కూర్చుని.. వారు చెప్పినట్టు చేశాడు. చిన్నపాటి విమానాన్ని సురక్షితంగా ఫ్లోరిడాలో ల్యాండ్ చేశాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంభాషణలను ప్రసారం చేసే లైవ్ ఏటీసీ డాట్ నెట్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. 

‘‘చాలా సీరియస్ పరిస్థితి ఎదురైంది. మా పైలట్ అచేతనంగా మారాడు. ఎయిర్ ప్లేన్ ఎలా నడపాలో కూడా నాకు తెలియదు. నాకు  ఫ్లోరిడా తీరమే కనిపిస్తోంది’’ అంటూ ప్రయాణికుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో స్పీకర్లలో అన్నాడు. ఆ విమానంలో ఒక పైలట్, ఇద్దరు ప్రయాణికులే ఉన్నారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ క్రిస్టోఫర్ ఫ్లోర్స్, అత్యంత సీనియర్ అయిన మరో కంట్రోలర్ రాబర్ట్ మోర్గాన్ ప్రత్యేక బాధ్యతలు తీసుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటి సూచన చేస్తూ, ఏం చేయాలో చెబుతూ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చూశారు. 




More Telugu News