దినేశ్ కార్తీక్ ఆటతీరుపై సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు
- ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తోన్న దినేశ్ కార్తీక్
- తాను సెలెక్టర్ నైతే కార్తీక్ ను టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేస్తానన్న గవాస్కర్
- దినేశ్ ఆడుతున్న తీరు చూస్తే కచ్చితంగా జట్టులో ఉండాలని వ్యాఖ్య
ఐపీఎల్ లో బెంగళూరు బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుత సీజన్‌లో దినేశ్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తోన్న అంశం గురించి గవాస్కర్ ప్రస్తావించారు. తాను గనుక టీమిండియా సెలెక్టర్ నైతే దినేశ్ కార్తీక్ ను కచ్చితంగా తదుపరి టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక చేస్తానని అన్నారు.
తాను గత ఏడాది ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ సందర్భంగా దినేశ్ కార్తీక్ తో కలిసి కామెంట్రీ చేశానని గుర్తు చేసుకున్నారు. క్వారంటైన్ లో ఉన్న సమయంలోనూ తాము ఇద్దరం చాలా సమయం కలిసి ఉన్నామని చెప్పారు. అప్పటి నుంచే దినేశ్ కార్తీక్ మళ్లీ టీమిండియాకు ఎంపికవ్వాలని, టీ20 ప్రపంచకప్ లో ఆడాలని ఎంతటి పట్టుదలతో ఉన్నాడో తనకు తెలిసిందని చెప్పారు.
గత ఏడాది ప్రపంచకప్ కు ఎంపిక అవ్వకపోయినప్పటికీ ఇప్పుడు దినేశ్ ఆడుతున్న తీరు చూస్తే కచ్చితంగా జట్టులో ఉండాలని అన్నారు. క్లాస్ ప్లేయర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తప్పకుండా జట్టులోకి తీసుకోవాలని చెప్పారు. దినేశ్ కార్తీక్ ఇప్పుడు ఆడుతున్న తీరును బట్టి చూస్తే టీ20 ప్రపంచకప్ లో తప్పకుండా బ్యాట్స్ మన్‌గా తీసుకోవాలని అన్నారు. కీపింగ్ ను అదనపు బాధ్యతలుగా అతనికి అప్పగించాలని చెప్పారు.