జ్ఞానవాపి మసీదు వద్ద జ్యోతిర్లింగం ఉంది: కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు మండలి అధ్యక్షుడు నాగేంద్ర పాండే
- పురాణాల్లో జ్ఞానవాపి ఆలయం గురించి క్లుప్తంగా ఉందన్న నాగేంద్ర
- జ్ఞానవాపి మసీదు గతంలో ఉన్న ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని వ్యాఖ్య
- ఇటీవల ఓ లాయరు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన వైనం
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు వద్ద చోటు చేసుకుంటోన్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ ప్రాంగణంలో జ్యోతిర్లింగం ఉన్నట్లు తాజాగా శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టు మండలి అధ్యక్షుడు నాగేంద్ర పాండే కూడా అన్నారు. మన పురాణాల్లో జ్ఞానవాపి ఆలయం గురించి క్లుప్తంగా వివరణ ఉందని వివరించారు.
ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదు గతంలో ఉన్న ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని ఆయన తెలిపారు. కాగా, తాజాగా మసీదు వద్ద సర్వే జరుగుతోన్న సమయంలోనూ ఓ న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి మసీదులోని వజుఖానా ప్రాంతంలో ఓ బావి ఉందని, అందులో నీటి స్థాయిని తగ్గించాలని కమిషనర్ ను కోరామని తెలిపారు. నీటి స్థాయి తగ్గిన అనంతరం అక్కడ శివలింగం ఉన్నట్లు గుర్తించామని అన్నారు.