ఇంద్రగంటికి ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ!

  • 'లైగర్' పూర్తి చేసిన విజయ్ దేవరకొండ 
  • ఆగస్టు 25వ తేదీన సినిమా విడుదల 
  • సెట్స్ పైకి వచ్చిన 'ఖుషి' మూవీ 
  • ఇంద్రగంటి ప్రాజెక్టు పట్ల ఆసక్తి చూపిన హీరో
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోంది. అనన్య పాండే కథానాయికగా అలరించనున్న ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా 'ఖుషి'ని విజయ్ దేవరకొండ పట్టాలెక్కించాడు. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 

సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే కశ్మీర్ లో ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాదులో ప్లాన్ చేశారు. ఈ సినిమా తరువాత మళ్లీ ఆయన పూరి దర్శకత్వంలోనే 'జనగణమన' చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. 

ఆ తరువాత విజయ్ దేవరకొండ సినిమా మోహనకృష్ణ ఇంద్రగంటితో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆయన కథ చెప్పడం .. విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇక ఇంద్రగంటి తాజా చిత్రంగా రూపొందిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.


More Telugu News