మోదీకి 8 ప్రశ్నలు సంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- మహిళా బిల్లు ఎక్కడుందని ప్రశ్నించిన కవిత
- గ్యాస్, డీజిల్, పెట్రోల్ బాదుడుతో వచ్చిన నిధులు ఎక్కడున్నాయంటూ నిలదీత
- పీఎం కేర్స్ లెక్కలు చెబుతారా? అంటూ అడిగిన కవిత
ప్రధాని నరేంద్ర మోదీకి 8 ప్రశ్నలు సంధిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం వరుస ట్వీట్లు సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో మోదీ సర్కారు విఫలమైందని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. 8 ఏళ్ల పాలనలో దేశానికి మోదీ చేసిందేమీ లేదని ఆరోపించిన కవిత... దేశాన్ని అన్ని రంగాల్లో దిగజార్చారని ఆమె ధ్వజమెత్తారు. మోదీకి కవిత సంధించిన ప్రశ్నలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1. సమాన అవకాశాల ద్వారా నారీ శక్తికి మరింత దన్ను కల్పిస్తామంటున్నారు కదా..మరి మహిళా బిల్లు ఎక్కడ?
2. దేశంలో క్రమంగా జీడీపీ తగ్గుతోంది. వేరే జీడీపీ మాత్రం పెరుగుతోంది. అదే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు. ఈ ధరల ద్వారా వస్తున్న డబ్బును ఎక్కడ పెట్టారు?
3. తెలంగాణ పట్ల వివక్ష ఎప్పుడు ముగుస్తుంది? తెలంగాణకు రావాల్సిన రూ.7 వేల కోట్లను ఎప్పుడు విడుదల చేస్తారు?
4. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. మరి దేశంలో అచ్చే దిన్‌ను ఎప్పుడు చూస్తాం?
5. దేశంలో శాంతి భద్రతలతో పాటు వ్యవస్థలు విఫలమయ్యాయి. మరి దేశ ప్రజలకు అమృత ఘడియలు ఎప్పుడిస్తారు?
6. దేశానికి రైతులే గుండె చప్పుడు. తెలంగాణకు చెందిన వరి, పసుపు రైతుల కష్టానికి కేంద్రం నుంచి కనీస గుర్తింపు దక్కక అన్యాయానికి గురవుతున్నారు.
7. న్యూ ఇండియా పేరిట మోదీ సర్కారు ఉపాధికి పాతరేశారు. ఫలితంగా కోట్లాది మంది భారతీయులు జీవనోపాధికి సరిపడ వేతనాలు అందించే ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
8. చివరగా పీఎం కేర్స్ నిధులకు సంబంధించిన లెక్కలను చెప్పే రోజు వస్తుందా?